NATIONAL

హిందూమతం అనేది జీవన విధానం-నిరూపించుకోవడానికి దేవాలయంకు.. సుప్రీం కోర్టు

అమరావతి: హిందూమతం అనేది జీవన విధానమని, ఈ విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి దేవాలయంకు వెళ్లడం లేదా పూజలు చేయడం తప్పనిసరేం కాదని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. హిందూమతంపై విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించుకున్నా సరిపోతుందని స్పష్టం చెసింది. కేరళలోని శబరిమల ఆలయం సహా పలు మతపరమైన ప్రదేశాల్లో మహిళలపై వివక్షకు సంబంధించిన పిటిషన్లతో పాటు దావూదీ బోహ్రాలతో సహా పలు మతాలు పాటించే మత స్వేచ్ఛ పరిధిపై విచారణ జరిపే క్రమంలో బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్‌లు బివి నాగరత్న, ఎంఎం సుందరేష్, అహ్సానుద్దీన్ అమానుల్లా, అరవింద్ కుమార్, అగస్టిన్ జార్జ్ మసీహ్, ప్రసన్న బి వరాలే, ఆర్ మహదేవన్,జాయ్‌మాల్యా బాగ్చిలు బెంచ్‌లో ఉన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *