AP&TG

సంప్రదాయ హస్తకళా వారసత్వానికి ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు-ఉప ముఖ్యమంత్రి

టెంపుల్ టూరిజం తరహాలో..

అమరావతి: సంప్రదాయ హస్తకళా వారసత్వానికి ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు అని ఆంధ్రప్రదేశ్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఒక జాతి చరిత్ర,,సంస్కృతి పైకి కన్పించే నిర్మాణల్లో కాదని, కళాకారులు సృష్టించిన అకృతుల్లో కనిపిస్తుందని అభివర్ణించారు. మంగళవారం విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో ఏర్పాటు చేసిన ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్ హస్తకళల ఉత్సవం 2026’ను పవన్ కల్యాణ్ ప్రారంభించారు. కళాకారుల అద్భుత ప్రతిభను, వారి కష్టాన్ని గుర్తించడానికి తాను ఈ కార్యక్రమానికి వచ్చానని తెలిపారు. హస్తకళాకారుల వస్తువుల తయారీ మాత్రమే కాకుండా, వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నారని పేర్కొన్నారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం తరహాలో హస్తకళల పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కళాఖండాన్ని రూపొందించిన కళాకారుడికి ఆ గుర్తింపు దక్కే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కళాకారుల కష్టాన్ని ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ప్రత్యేక డాక్యుమెంటరీలు రూపొందించాలని అధికారులకి దిశానిర్దేశం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *