అత్యున్నత పురస్కారంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సత్కరించిన ఇండోనేషియా ప్రభుత్వం
ఐఐఎం బెంగళూరు క్యాంపస్ ఏర్పాటు..
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, ఇండోనేషియా ప్రభుత్వం అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. “బిన్టాంగ్ ఆదిపూర్ణ అవార్డు”తో మోదీని సన్మానించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆ మెడల్‌ను అందజేశారు. ప్రస్తుతం ప్రధాని మోదీ ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు.ఎంతో ప్రేమతో ఇండోనేషియాకు తనకు అత్యున్నత పురస్కారాన్ని అందజేసినట్లు పీఎంవో కార్యాలయం తన ట్వీట్లో తెలిపింది. ఈ గౌరవం కోట్లాది మంది భారతీయులకు చెందుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ సత్కారం ఇండోనేషియా ప్రజల భావోద్వేగాలకు చెందుతుందని, భారత్, ఇండోనేషియా మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు ఇది నిదర్శనమన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసినట్లు మోదీ పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, శ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తులను ఇండోనేషియా సర్కారు బింటాంగ్ ఆదిపూర్ణ అవార్డుతో సత్కరిస్తుంది.
ఐఐఎం బెంగళూరు క్యాంపస్:- భారత్, ఇండోనేషియాల మధ్య సాంకేతిక, విద్యారంగాల్లో పరస్పర సహకారం కోసం పలు కీలక ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా ఇరుదేశల యువతను శక్తిమంతం చేయడం, కృత్రిమ మేధ, అంతరిక్ష పరిశోధన వంటి అత్యాధునిక రంగాల్లో సహకారాన్ని విస్తరించడం లక్ష్యంగా ఇరుదేశాలు మంగళవారం పలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, మొత్తం ఆసియాన్ ప్రాంతానికి ఉపయోగపడేలా ఇండోనేషియాలో భారతదేశపు టాప్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఐఐఎం బెంగళూరు క్యాంపస్‌ను ఐఐఎం బెంగళూరు క్యాంపస్ చేస్తున్నట్లు ఇరుదేశాలు ప్రకటించాయి.

