NATIONAL

భారతదేశ చరిత్రలో ఒక మైలు రాయిని నెలకొల్సిన నరేంద్ర దామోదర్ దాస్ మోదీ

అమరావతి: భారతదేశానికి అత్య‌ధిక కాలం ఎన్నికైన ప్ర‌ధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఒక మైలు రాయిని లిఖించారు. గ‌తంలో నెహ్రూ పేరిట ఉన్న రికార్డును నరేంద్రమోదీ బద్దలు కొట్టారు.ఈ సందర్బంను పురస్కరించుకుని కేంద్ర మంత్రి వర్గం బుధవారం ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైంది. అత్య‌ధిక రోజులు ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన నరేంద్రమోదీని ప్ర‌శంసిస్తూ కేంద్ర క్యాబినెట్ తీర్మానం అమోదించింది. మంత్రి వర్గం మొత్తం సమావేశంలో పాల్గొన్నారు. నరేంద్రమోదీపై ప్ర‌శంస‌లు కురిపిస్తూ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ ప్ర‌క‌ట‌న చేసిన అనంతరం మంత్రులంద‌రూ లేచి నిల‌బ‌డి చ‌ప్ప‌ట్లు కొట్టి అభినందనలు తెలిపారు.

2014 మే 26వ తేదీన దేశ ప్ర‌ధానిగా నరేంద్రమోదీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.అనంతరం 2019 ఎన్నిక‌ల్లోనూ భారీ మెజారిటీతో గెలిచి ప్ర‌ధానిగా మే 30వ తేదీన రెండవ సారి ప్ర‌ధాని బాధ్య‌త‌లు చేప‌ట్టారు. మూడోసారి కూడా ప్ర‌ధానిగా 2024 జూన్ 9వ తేదీన మోదీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. గ‌తంలో మాజీ ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ 4398 రోజుల పాటు బ్రేక్ లేకుండా ప్ర‌ధానిగా చేశారు. నెహ్రూ పేరిట వున్న రికార్డును చెరిపివేస్తూ నేటితో 4399 రోజుల పాటు ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు నిర్వర్తిస్తున్న ప్రధానిగా మోదీ ఘ‌న‌త సాధించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *