ఇంకెంతకాలం ఆంధ్రావాళ్లను తిడుతూ కాలక్షేపం చేస్తారు-జనసేనాని సూటి ప్రశ్న
కొండగట్టు ఆలయ అభివృద్దికి 30 కోట్ల రూపాయిలు..
హైదరాబాద్: తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలంగాణలో పోటీ చేస్తామని ఆయన కుండ బద్దలు కొట్టారు. మంగళవారం జూబ్లీహిల్స్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. దేశంలో అంతర్భాగం తెలంగాణ అని స్పష్టం చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన వారే.. పదవుల్లో ఉన్నారని.. ఎమ్మెల్యేలు అయ్యారని పవన్ కల్యాణ్ తలిపారు. తెలంగాణ అంటే గౌరవం ఉంది కనుకే కొండగట్టు ఆలయ అభివృద్దికి 30 కోట్ల రూపాయిలు టీటీడీ కేటాయించడం జరిగిందన్నారు. మీ తాటాకు చప్పుళ్లకు జనసేన పార్టీ భయపడదని, భయపడేవాడినే అయితే పార్టీ పెడతానా? అని ప్రశ్నించారు. కమ్యునిజం చచ్చిపోయిందంటే,అనాలిస్టు అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడిన వ్యక్తి లాంటి వళ్ల కమ్యునిజం చచ్చిపోయిందన్నారు.ఇక్కడకి ఎలా అడుగు పెడతవంటూ కొంత మంది మాట్లాడుతూన్నారు. అలా మాట్లాడేవాళ్ల అయ్యా జగీరా తెలంగాణ అంటూ ప్రశ్నించారు.గుంటూరులో భిఆర్ఎస్ కార్యాలయం పెడితే స్వాగతించామని ఏపీ డిప్యూటీ సీఎం గుర్తు చేశారు.
మద్రాస్‌లో ఉన్న చిత్రపరిశ్రమ:- తెలంగాణలో ఉపాధి లేకపోతే తాను కారణమా? అని రాజకీయ పార్టీల నాయకులను ఆయన సూటిగా నిలదీశారు. మద్రాస్‌లో ఉన్న చిత్రపరిశ్రమ ఇక్కడికి ఎలా వచ్చిందన్నారు.ఇంకెంతకాలం ఆంధ్రావాళ్లను తిడుతూ కాలక్షేపం చేస్తారంటూ తెలంగాణలోని నాయకులకు ఆయన సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో ఏపీ కాంట్రాక్టర్లు బాగానే ఉన్నారన్నారు. తాను చెరువును కబ్జా చేశానని కొందరు అంటున్నారని, అలా చేస్తే తనను ఇక్కడ ఉండనిస్తారా? అని ఆయన సూటిగా నిలదీశారు. తన ఫామ్‌హౌస్ కబ్జా అని నిరుపిస్తే, దానిని రాష్ట్ర ప్రభుత్వానికే రాసిస్తానన్నారు. గద్దర్‌తో తనకు చాలా సాన్నిహిత్యం ఉందని గుర్తు చేసుకున్నారు.
