AP&TG

మన జలాల్లో గస్తీ పెంచి మత్స్యకారుల హక్కులు కాపాడతాం- సీఎం చంద్రబాబు

నెల్లూరు: తీర ప్రాంత అభివృద్ధిలో మత్స్య కారులకు భాగస్వామ్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మత్స్య కారుల సంక్షేమానికి.. వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని సీఎం వెల్లడించారు. కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అలాంటి వారు చేసే ఫేక్ ప్రచారాలను పట్టించు కోవద్దని స్పష్టం చేశారు. నెల్లూరు కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామంలో మంగళవారం మత్స్య కారుల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వేట నిషేధ సమయంలో 1,30,796 మంది మత్స్య కార కుటుంబాలకు రూ.261.50 కోట్ల ఆర్ధిక సాయాన్ని అందించారు. మత్స్య కారుల సేవలో కార్యక్రమంతో మత్స్య కారుల కుటుంబానికి రూ.20 వేలు చొప్పున ఆర్ధిక సాయాన్ని అందించారు.

కావలి ప్రాంతంలో సాగర్ డిఫెన్స్ సంస్థ ఏర్పాటు అవుతోంది. దీని ద్వారా స్థానికులకే ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయి. రూ.288 కోట్లతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపడుతున్నామన్నారు.

రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువుల్లో నీళ్లు నిండుగా ఉన్నాయి. అక్కడ చేపల పెంపకం చేపట్టండి. ఆ మత్స్య సంపదను విక్రయించుకునే హక్కులను మత్స్య కారులకే అప్పగించాం. రాష్ట్రవ్యాప్తంగా నీటి వనరుల్లో ఫిష్ సీడ్ ను అందించేలా మత్య్స శాఖకు ఆదేశాలిచ్చాం అని తెలిపారు.

 దేశంలో చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. ఇది కొనసాగాలంటే… మత్స్య కారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి… వారికి అండగా నిలవాలి. ఆ దిశగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు.

గొడ్డలి పార్టీ లేనిపోని కుట్రలు చేస్తోంది. గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఎక్కడా అభివృద్ధి చేయలేదు. సంక్షేమం అందించలేదు. అన్ని రంగాలను విధ్వంసం చేశారు.. వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. అలాగే మత్స్య రంగం కూడా దెబ్బతినేలా చేశారన్నారు. రాష్ట్రానికున్న సుదీర్ఘమైన తీరప్రాంతంలో లక్షల మంది మత్స్య కారులు చేపల వేటతో ఉపాధి పొందుతున్నారు. గొడ్డలి పార్టీ లేనిపోని కుట్రలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం సంక్షేమం చేస్తుంటే గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు.

ప్రతీ ఇంటిపైనా,  పొలంలోనూ సోలార్ రూఫ్ టాప్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతాం.”అని ముఖ్యమంత్రి చెప్పారు.

తీర ప్రాంతంలో సముద్రపు నాచు సాగు చేసేలా మత్స్య కార మహిళలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ సందర్బంగా సీఎం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీఎస్ఎంసీఆర్ఐ సహకారంతో మత్స్యకార మహిళలు అదనపు ఆదాయం పొందేలా సీవీడ్ కల్చర్ చేసేందుకు శిక్షణ ఇవ్వనున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *