DISTRICTS

నెల్లూరులో 40 కోట్లతో తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ

నెల్లూరు: నెల్లూరు మునిసిపాల్ కార్పొరేషన్ పరిధిలోని 54వ డివిజన్‌లో 350 కిలో లీటర్ల సామర్థ్యం గల మంచినీటి ట్యాంకు నిర్మాణానికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ భూమిపూజ చేశారు. అనంతరం 14వ డివిజన్ ఏసీ నగర్ మల్లెల సంజీవయ్య స్కూల్‌లో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు.నూతనంగా ఏర్పాటు చేసిన క్లాస్ రూం బల్లలపై కూర్చొని నాణ్యతను పరిశీలించారు.

14,000 కోట్లతో అమృత్ పథకం పనులు:- ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోయినా సీఎం చంద్రబాబు అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగుతున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14,000 కోట్లతో అమృత్ పథకం పనులు జరుగుతున్నాయని, రాబోయే రెండేళ్లలో ప్రతీ ఇంటికీ స్వచ్ఛమైన నదీజలాలను అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే నెల్లూరులోని ప్రభుత్వ హైస్కూళ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరిస్తున్నామని, వక్ఫ్ బోర్డు స్థలంలో 20 కోట్లతో విఆర్సీకి దీటుగా మరో ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్ నిర్మిస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఎస్ఈ మోహన్,అడిషనల్ కమీషనర్ హిమబిందు,మేయర్ సుజాతా 54వ డివిజన్ టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *