బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకరం
అమరావతి: బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత సామ్రాట్ చౌదరి, బుధవారం పాట్నాలోని లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో పదవీ ప్రమాణం చేశారు. గవర్నర్ సయ్యద్ అట హస్నైన్, సామ్రాట్‌తో ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు సీఎంగా ఉన్న నితీష్ కుమార్ మంగళవారం రాజీనామా చేశారు.ఆయన రాజ్యసభలో సభ్యత్వం పొందడంతో, ఆయన స్థానంలో సామ్రాట్ చౌదరి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. బిహార్‌లో ప్రస్తుతం జేడీయూ, బీజేపీ, ఇతర పార్టీలతో కలిసి ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. జేడీయూ నుంచి నితీష్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించగా, అయన క్యాబినేట్ లో డిప్యూటీ సీఎంగా ఉన్న బీజేపీ నేత సామ్రాట్ చౌదరి సీఎం పదవి చేపట్టారు. బీజేపీకి సీఎం పదవి దక్కడంతో జేడీయూకు రెండు డిప్యూటీ సీఎం పదవులు లభించాయి. జేడీయూ ఎమ్మెల్యే విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్‌లు డిప్యూటీ సీఎంలుగా ఎన్నికయ్యారు. బిహార్‌లో బీజేపీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం ఇదే తొలిసారి. సామ్రాట్. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే సామ్రాట్, సెక్రటేరియట్‌కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం దేశంలో సీఎం పదవిలో కొనసాగుతున్న 16వ బీజేపీ నేతగా సామ్రాట్ నిలిచారు. దేశంలో ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో సీఎంలుగా బీజేపీ నేతలు కొనసాగుతున్నారు.

