ధాన్య సేకరణను క్షేత్రస్థాయి పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు: కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా విడవలూరు మండలంలో పర్యటించారు. తొలుత పార్లపల్లి వద్ద రోడ్డుపై దాన్యాన్ని ఉంచిన రైతులతో మాట్లాడారు. ఎంత దిగుబడి వచ్చింది ధాన్య సేకరణ జరుగుతుందా వివరాలు సేకరించారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి లక్ష్మీతో మాట్లాడుతూ ధాన్య సేకరణ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ 90 శాతం హార్వెస్టింగ్ జరిగిందని ధాన్య సేకరణలో విషయంలో ఎటువంటి లోపాలు లేవని సజావుగా ప్రక్రియ కొనసాగుతుందని ఆమె, కలెక్టర్ కు వివరించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులపై సమీక్షిస్తూ మండల అభివృద్ధి అధికారి నగేష్ కుమారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎన్ని కిలోమీటర్ల మేర, ఎక్కడెక్కడ జాతీయ ఉపాధి హామీ పనులు జరుగుతున్నది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి విడవలూరు మండల రెవెన్యూ అధికారి కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న కావలి RDO ఎలీషాతో మాట్లాడుతూ కావలి డివిజన్ పరిధిలోని మండల రెవెన్యూ అధికారులతో సమావేశాలు నిర్వహించి PGRSలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించవలసిందిగా సూచించాలన్నారు. అదేవిధంగా సరైన ఎండార్స్మెంట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

