SIR ప్రక్రియకు ఎటువంటి అటంకం రానివ్వం-సీజేఐ సూర్యకాంత్
ఓట్ల రాజకీయాలపై మమతా బెనర్జీకి చెంపదెబ్బ..
అమరావతి: పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ఓట్ల కోసం వివిద పార్టీలు రాజికీయలు చేస్తున్న సమయంలో, సుప్రీంకోర్టు కీలక,కఠినమైన వ్యాఖ్యలు చేసింది. SIR ప్రక్రియను ఎవరూ అడ్డుకోవడానికి అనుమతించబోమని, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలు సహించబోమని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది.ఈ విషయంలో అవసరమైతే తగిన ఆదేశాలు జారీ చేస్తామని కాస్త కటువుగానే హెచ్చరించింది.సోమవారం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చి, జస్టిస్ ఎన్వీ అంజారియా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు విచారణ జరిపింది. SIR ప్రక్రియ కారణంగా పెద్ద ఎత్తున ఓటర్ల పేర్లు తొలగించే ప్రమాదం ఉందని, అర్హులైన ఓటర్లు తమ హక్కు కోల్పోయే అవకాశముందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మాస్ ఎక్స్ క్లూజన్ జరిగే అవకాశం వుంటుందన్న అభిప్రాయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన సీజేఐ, SIR ప్రక్రియకు ఎటువంటి అటంకం రానివ్వమని, ఇది రాష్ట్రాలన్నీ గమనించాలని స్పష్టం చేశారు.

