AP&TG

హాస్టల్ విద్యార్థులకు అనారోగ్య సమస్యలు వస్తే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత-సీ.ఎం చంద్రబాబు

ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి ఉప ముఖ్యమంత్రి..

అమరావతి: వేసవి కాలం రానున్న నేపథ్యంలో నీటి ఎద్దడి అనేది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఇప్పటి నుంచే సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూసుకోవడంతోపాటు… పశువుల దాణాకూ సమస్యలు రాకూడదని సీఎం చెప్పారు. మరోవైపు ప్రజాసమస్యలు-పాలనా తీరు తెలుసుకునేందుకు మంత్రులు, కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పాలసీల అమలు క్షేత్ర స్థాయిలో ఎలా ఉందనే దానిని  ప్రత్యక్షంగా చూడాలన్నారు. పైస్థాయిలో ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా… క్షేత్ర స్థాయిలో పాలసీలు సమర్ధవంతంగా అమలు కానప్పుడు ఆశించిన ఫలితాలు రావని సీఎం అభిప్రాయపడ్డారు. వివిధ వర్గాల ప్రజలతో అధికారులు తరుచూ మాట్లాడుతూ ఉంటే చాలా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. అల్లూరి జిల్లా లంబసింగిలో కుంకుమ పువ్వు ఉత్పత్తికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు కశ్మీర్లో మాత్రమే కుంకుమ పువ్వు ఉత్పత్తి జరుగుతోంది. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏలూరు సమీపంలో కోకో సిటీ కూడా ఏర్పాటు అవుతుంది. కాఫీ సాగు పెంచటంతో పాటు అరకు కాఫీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నాం.. ఇది మరింతగా పెరగాలి.” అని సీఎం చంద్రబాబు వివరించారు.

జీ రామ్ జీ పనులపై కార్యాచరణ సిద్దం చేయాలి:- “పారిశ్రామిక కాలుష్యం ద్వారా భూగర్భ జలాలు కలుషితం కాకుండా చూడాలి. సురక్షితమైన తాగునీరు ప్రజలకు అందాలి. ఆశ్రమ హాస్టల్‌లో కలుషితమైన నీరు కారణంగా విద్యార్ధులు అస్వస్థతకు గురైన పరిస్థితి ఎదురైంది. ఈ తరహా ఘటనలు ఇక రాష్ట్రంలో ఉత్పన్నం కాకూడదు. మళ్లీ ఇలాంటి సంఘటనలు జరిగితే… దానికి సంబంధిత జిల్లా కలెక్టర్, ఇంచార్జ్ మంత్రులదే బాధ్యత. పంచాయితీరాజ్ రోడ్లు, నీటి సంరక్షణా చర్యలు, గోకులం షెడ్లు, మేజిక్ డ్రెయిన్లు చేపట్టాలి.”అని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి ఉప ముఖ్యమంత్రి:- రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నా అధిగమించి ముందుకు వెళ్తున్నామని, నిర్ణయాల అమలు, పనుల పూర్తి విషయంలో అలసత్వం వద్దన్నారు. క్షేత్ర స్థాయిలో ఇంకా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయని, ఉదాసీనత వీడాలని, పారదర్శకతే మా విధానం అని స్పష్టం చేశారు.

ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేయాలి:-కూటమి ప్రభుత్వం ప్రజలకు పారదర్శకమైన పాలన, అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు నిబద్ధతతో పని చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం మార్గదర్శకాలుగా ముందుకు వెళ్తున్నాం. దీనికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేయాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నాలుగు గోడల మధ్య మంత్రులు, ఉన్నతాధికారులు తీసుకునే ప్రజోపయోగ నిర్ణయాలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అర్ధవంతంగా అందాలంటే అంతా సమష్టిగా పనిచేయాలని సూచించారు. సోమవారం సచివాలయంలో మంత్రులు, శాఖల కార్యదర్శుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *