NATIONAL

భారత్-రష్యాల స్నేహం ఓ ధ్రువతారలా స్థిరంగా ఉంటుంది-ప్రధాని మోదీ

అమరావతి: గత 80 సంవత్సరాలుగా అనేక కాల పరిక్షలకు తట్టుకుని భారత్‌, రష్యా మధ్య చారిత్రక సంబంధాలు కొనసాగుతుయని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు..ఇరు దేశాల మధ్య స్నేహం శాశ్వతంగా ఉంటుందని చెప్పారు. శుక్రవారం ప్రదాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ లు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. భారత్‌, రష్యా ద్వైపాక్షిక సత్సంబంధాలు నేడు జరిగిన ఒప్పందాలు మైలురాయిగా నిలుస్తాయని తెలిపారు. ఇండియా-రష్యా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడానికి ప్రాధాన్యమిస్తున్నామని,,2030 సం..వరకు ఇరు దేశాల మధ్య వ్యాపారాలను మరింత విస్తరించేందుకు ఆర్థిక సహకార ప్రోగ్రాన్ని కొనసాగించడానికి ఇరు దేశాలు అంగీకరించాయన్నారు.రష్యా అధ్యక్షడు పుతిన్‌ అందిస్తున్న సహకారాన్ని మోదీ కొనియాడారు. 2010లో మన భాగస్వామ్యానికి స్పెషల్ ప్రివిలిజ్డ్ స్ట్రాటెజిక్ పార్ట్నర్‌షిప్ హోదా ఇచ్చారన్నారు. గత రెండున్నర దశాబ్దాలుగా భారత్ ప్రతి కూలపరిస్థితిల్లోనూ, పుతిన్ నాయకత్వం మన స్నేహ బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిందన్నారు. ఇండియాతో ఆయన కొనసాగిస్తున్న ఈ స్నేహం, నిబద్ధతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.ఇరు దేశాల మధ్య పలు వాణిజ్య,రక్షణ,బాస్వామ్య ఒప్పందాలు జరిగాయి.

వ్యాపారం 100 బిలియన్లకు:- ఉగ్రవాదంపై పోరులో భారత్, రష్యా చాలా కాలంగా ఒకేతాటిపై నడుస్తున్నాయన్నారు. పహల్గాంలో ఉగ్రదాడి, క్రోకస్ సిటీ హాల్‌పై పిరికిపందలు చేసిన దాడి,,ఇలాంటి సంఘటనలన్నింటికీ మూలం ఉగ్రవాదం అని అన్నారు.ఉగ్రవాదం అంటే మానవతా విలువలపై చేస్తున్న ప్రత్యక్ష దాడే అని భారత్ నమ్ముతోందన్నారు. మోదీతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయని పుతిన్ అన్నారు. భారత్‌తో కీలక ఒప్పందాలపై చర్చలు జరిగాయని చెప్పారు.ప్రస్తుతం ఇరు దేశాల మధ్య 64 బిలియన్ల వ్యాపారం జరుగుతొందని,,తొందరలోనే 100 బిలియన్లకు చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నమన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *