సంచార్ సాథీ యాప్‌ను డిలీట్ చేసుకోవచ్చు-మంత్రి జ్యోతిరాధిత్య సింథియా
అమరావతి: కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ జారీ చేసిన సంచార్ సాథీ యాప్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ మొబైల్ నుంచి సంచార్ సాథీ యాప్‌ను డిలీట్ చేసుకోవచ్చు తెలిపారు.సదరు యాప్ తప్పనిసరి కాదు అని ఆయన స్పష్టత ఇచ్చారు.మీరు కొత్తగా కొనుగొలు చేస్తున్న స్మార్ట్ ఫోన్లల్లో గూగుల్ యాప్స్ ఇన్ స్టాల్ చేసి వుంటాయని,మన యాప్ కూడా అలాంటిదే అని చెప్పారు.
దాదాపు రూ.22 వేల కోట్ల మోసాలు:- భారతదేశంలో తప్పుడు దృవ పత్రాలతో సిమ్ కార్డులు తీసుకున్న దాదాపు 2 కోట్ల కనెక్షన్స్ గుర్తించి తొలగించడం జరిగిందన్నారు.2024లో సైబర్ నేరగాళ్లు అమాయకులైన ప్రజల నుంచి దాదాపు రూ.22 వేల కోట్లను కొల్లగొట్టారని,,అలాంటి వారి ఆగడాలను అరికట్టేందుకే ఈ యాప్ ను ప్రవేశ పెట్టినట్లు చెప్పారు. ఈలాంటి మోసాలను నిలవరించేందుకు దేశ ప్రజలకు ప్రభుత్వం నుంచి భరోసా కల్పించడమే కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ ప్రయత్నం అన్నారు. విఫక్షలు ఆర్దం లేని అరోపణలతో పార్లమెంట్ లో గందరగోళం స్పష్టించడం వారికి అలవాటుగా మారి పోయిందని మండిపడ్డారు.
సంచార్ సాథీ యాప్‌ను ప్రీ-ఇన్స్టాల్: స్మార్ట్ ఫోన్లు తయారు చేసే కంపెనీలకు ఇటీవల కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ కీలక ఆదేశాలు ఇస్తూ,, కచ్చితంగా స్మార్ట్ ఫోన్లలో ప్రభుత్వ సంబంధిత సంచార్ సాథీ యాప్‌ను ప్రీ-ఇన్స్టాల్ చేసి ఉంచాలని పేర్కొన్నది. ఆ ఆదేశాలను విపక్షాలు తప్పుపడుతున్నాయి. సంచార్ సాథీ యాప్ వల్ల గోపత్యకు భంగం కలిగే అవకాశాలు ఉన్నట్లు విమర్శలు చెబుతున్నారు.
7.50 లక్షల ఫోన్లు రికవరీ:- 2025 జనవరిలో పంచార్ సాథీ యాప్ ను కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ కీలక ప్రారంభించింది..దిని సాయంతో 7.50 లక్షలకు పైగా పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ చేశారు.ఇప్పటి వరకు 20 లక్షల ఫోన్ల అచూకీ కనుగొనట్లు తెలిపారు. 2025 నవంబర్ 28వ తేదిన ప్రభుత్వం ప్రైవేటుగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అన్ని ప్రధాన స్మార్ట్ ఫోన్ కంపెనీలు పంచార్ సాథీ యాప్ ను కొత్త మొబైల్ ఫోన్లలో 90 రోజుల్లోపల ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఈ యాప్ యూజర్లు డిజేబుల్ చేసే అవకాశం ఎంతమాత్రం ఉండదు. అయితే ఇప్పటికే మార్కెట్లోకి వెళ్లిపోయిన కొత్త మొబైల్ ఫోన్లకు సాఫ్ట్ వేర్ అప్డేట్స్ ద్వారా తయారీదారులు ఈ యాప్‌ను పంపించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులో ఆదేశించింది.

