AP&TG

34 శాతం బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

హైకోర్టు తీర్పునే సమర్ధించిన సుప్రీంకోర్టు..

50% మించి రిజర్వేషన్లు ఉండకూడదు..

అమరావతి: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. 34 శాతం కోటాతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటుతున్నాయంటూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను హైకోర్టు ఇటీవల కొట్టివేసిన సంగతి విదితమే.దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం నిరాకరించింది. డెడికేటెడ్ కమిషన్ నివేదికను అమలు చేస్తున్నట్లు ఎక్కడుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

(స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 243-D(6), 243-T(6) ప్రకారం రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారాల పరిధి, రిజర్వేషన్లను సమర్థించేందుకు అవసరమైన శాస్త్రీయ ఆధారాలపై ఈ వివాదం కొనసాగింది. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు నిర్ణయించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన గణాంకాలు, క్షేత్రస్థాయి సమాచారాన్ని ఏ విధంగా పరిగణనలోకి తీసుకోవాలన్నది కూడా కీలక అంశంగా మారింది.

ఇదే అంశంపై అక్టోబర్‌ 1, 2026న ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన G.O MS నంబర్‌ 105, G.O RT నంబర్‌ 1065లను కొట్టివేసింది.)

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *