AP&TG

ఇన్‌-సర్వీస్‌ పీజీ కౌన్సెలింగ్‌ ద్వారా 322 వైద్యుల పోస్టుల భర్తీ

14 వైద్య విభాగాల్లోని ఖాళీ పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్‌..

380 మంది హాజరు..

అమరావతి: డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ పరిధిలో నిర్వహించిన ఇన్‌-సర్వీస్‌ పీజీ కౌన్సెలింగ్‌ ద్వారా 322 మంది వైద్యులు పోస్టులను ఎంపిక చేసుకున్నారు. మొత్తం 14 వైద్య విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నిర్వహించిన కౌన్సెలింగ్‌కు 380 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఎంపికైన వారిలో 305 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (సీఏఎస్‌) పోస్టులకు, 17 మంది డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ (డీసీఎస్‌ఎస్‌) పోస్టులకు ఎంపికయ్యారు. కౌన్సెలింగ్‌ వివరాలతో కూడిన నివేదికను డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ చక్రధర్‌ బాబు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు అందజేశారు.

ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ పరిధిలోని ఇన్‌-సర్వీస్‌ పీజీ వైద్యుల కోసం ఈ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మొత్తం ఖాళీల్లో 387 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు, 114 డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ పోస్టులు, 15 పీజీ లీన్‌ పోస్టులు ఉన్నాయి. కౌన్సెలింగ్‌లో ఎంపికైన 322 మందిలో 305 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు, మిగిలిన 17 మంది డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ పోస్టులకు ఎంపికయ్యారు. మరో 16 మంది తమ ఎంపికలను విరమించుకున్నారు. పోస్టులు అందుబాటులో లేని 40 మందిని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు తిరిగి పంపించనున్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *