AP&TG

దసరా 2026కు APSRTC 5,261 ప్రత్యేక బస్సులు

అమరావతి: దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) రాష్ట్రవ్యాప్తంగా 5,261 ప్రత్యేక బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

2026 దసరా ఉత్సవాలు అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్నాయి. మూల నక్షత్రం అక్టోబర్ 16న, దుర్గాష్టమి అక్టోబర్ 18న, మహర్నవమి అక్టోబర్ 19న, విజయదశమి అక్టోబర్ 20న జరగనున్నాయి.

ప్రయాణికుల స్వస్థలాలకు రాకపోకలను సులభతరం చేసేందుకు అక్టోబర్ 16 నుంచి 19 వరకు ప్రీ-దసరా, అక్టోబర్ 20 నుంచి 25 వరకు పోస్ట్-దసరా ప్రత్యేక సర్వీసులను APSRTC ఏర్పాటు చేసింది.

ప్రధాన గమ్యస్థానాలకు ప్రత్యేక బస్సులు:-

హైదరాబాద్ – 1,186–విజయవాడ – 1,053–ఇతర గమ్యస్థానాలు – 1,360–బెంగళూరు – 475–విశాఖపట్నం – 440–రాజమండ్రి – 347–తిరుపతి – 247–చెన్నై – 153

జోన్ల వారీగా జోన్-1లో 1,107, జోన్-2లో 2,218, జోన్-3లో 818, జోన్-4లో 1,118 ప్రత్యేక బస్సులు నడపనున్నారు.

జిల్లాల వారీగా అత్యధికంగా NTR జిల్లాకు 804, విశాఖపట్నానికి 416, ఏలూరుకు 340, వైఎస్ఆర్ కడపకు 318, శ్రీకాకుళానికి 279, తూర్పుగోదావరికి 260, ప్రకాశం జిల్లాకు 245, కాకినాడకు 224 ప్రత్యేక బస్సులు కేటాయించారు. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా అవసరమైన చోట అదనపు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేందుకు APSRTC ఏర్పాట్లు చేస్తోంది. దసరా అనంతరం స్వస్థలాల నుంచి తిరుగు ప్రయాణాల రద్దీని దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 20 నుంచి 25 వరకు కూడా ప్రత్యేక సర్వీసులు కొనసాగనున్నాయి. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా అందించడమే APSRTC ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *