AP&TG

స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహిస్తాం-ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) అనిల్‌చంద్ర పునేఠా కీలక ప్రకటన విడుదల చేశారు.

బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు:-ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVMs) ద్వారా కాకుండా, పూర్తిగా బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే: సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాలపై తుది తీర్పు వచ్చిన వెంటనే ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతామని తెలిపారు.

ఓటర్ల జాబితా:- ఈ ఏడాది ఫిబ్రవరి 5 నాటికి సిద్ధమైన ఫొటో ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకుని ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఏర్పాట్లు: స్థానిక సంస్థల వారీగా బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశామని, బ్యాలెట్ పేపర్ల ముద్రణకు త్వరలోనే ప్రింటింగ్ ప్రెస్‌ను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. పరిస్థితులకు అనుగుణంగా విడతలవారీగా ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *