ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యం సురక్షితమైన చేతుల్లో ఉంది- కేంద్ర మంత్రి
అమరావతి: చంద్రబాబు నాయకత్వం, సత్యకుమార్ కృషిపై పూర్తి విశ్వాసం ఉందని, ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య రంగం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ నాయకత్వంలో పని చేస్తొందని కేంద్ర ఆరోగ్య, రసాయనాలు–ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా ప్రశంసించారు. నూతన క్రిటికల్ కేర్ బ్లాకులు, సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలను నడ్డా అభినందించారు. చంద్రబాబు నాయకత్వంపై, సత్యకుమార్ కృషిపై తనకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగంలో దేశంలోనే ముందంజలో నిలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, వ్యాధుల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న తీరును కేంద్ర మంత్రి అభినందించారు.
వైద్య సిబ్బందికి అభినందనలు:- రాష్ట్రంలోని వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, యువ వైద్యులు, వైద్య విద్యార్థులు అంకితభావంతో పనిచేస్తున్న తీరును నడ్డా ప్రశంసించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వారు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.చంద్రబాబు నాయకత్వం, సత్యకుమార్ కృషి, వైద్య ఆరోగ్య సిబ్బంది అంకితభావంతో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగం కొత్త శిఖరాలకు చేరుకుంటోందని నడ్డా ప్రశంసించారు.

