NATIONALPOLITICS

బిహార్‌లోని బంకీపూర్ శాసనసభ ఉపఎన్నికలో కిషోర్ అనూహ్య విజయం

బీజేపీ అధిష్టానంకు ఒక బలమైన సందేశం..

అమరావతి: బిహార్‌లోని బంకీపూర్ శాసనసభ ఉపఎన్నికలో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అనూహ్య విజయం సాధించారు.1995 నుంచి బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రశాంత్ కిశోర్ తన సమీప బీజేపీ అభ్యర్థి నీరజ్ సిన్హాపై 18,953 ఓట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నికైన తరువాత బంకీపూర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. దీంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించారు.

బీజేపీ అధిష్టానంకు ఒక బలమైన సందేశం:- సోమవారం కౌంటింగ్ మొదలైనప్పటి నుంచీ బీజేపీ నేత నీరజ్‌ కుమార్‌ కంటే ముందంజలో ఉన్న ప్రశాంత్ కిశోర్ ఒక్కో రౌండ్ ముగిసేసరికి తన ఆధిక్యాన్ని అంతకంతకూ పెంచుకున్నారు. ప్రశాంత్ కిశోర్ కు 63,203 పోల్ కాగా రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ కు 44,250, మూడో స్థానంలో నిలిచిన ఆర్జేడీ అభ్యర్థి రేఖ కుమారి 14,085 ఓట్లు సాధించారు. ఈ విజయం అనంతరం ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ, తన గెలుపు బీజేపీ హైకమాండ్‌కు ఒక బలమైన సందేశమని వ్యాఖ్యానించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తిని బిహార్ ముఖ్యమంత్రిగా చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.సామ్రాట్ చౌదరిని వెంటనే సీఎం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఉపఎన్నిక ఫలితం బిహార్ రాజకీయాల్లో సరికొత్త మార్పునకు సంకేతమని ఆయన పేర్కొన్నారు. జన్ సురాజ్ పార్టీ ప్రారంభం అయిన తరువాత తొలి విజయం ఇది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *