NATIONAL

ఇండియాలోని కాక్రోచ్ జ‌న‌తా పార్టీకి అమెరికాలో ఉన్న దాతలు భారీగా విరాళాలు-మేరీ మిల్బెన్

అమరావతి: ఢిల్లీ నిరసనల గురించి అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ బుధవారం ఒక సంచలనాత్మక ఆరోపణ చేశారు; ఇటీవల ఏర్పాటైన రాజకీయ వ్యంగ్య వేదిక ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP)కి అమెరికాలోని “కొందరు ఎంపిక చేసిన దాతల” నుంచి నిధులు అందుతున్నాయని ఆమె పేర్కొన్నారు. జాతీయ వాదులు సైలెంట్‌గా ఉండాల్సిన స‌మ‌యం ఇది కాదు అని, ,”దేశంలోని వివిధ విఛ్ఛిన్నక‌ర శక్తులను” ఢీకొట్టేందుకు దేశంలోని యువ‌త శాంతియుత నిర‌స‌న చేప‌ట్టాల‌ని ఆమె పిలుపునిచ్చారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ విప‌క్షాల‌తో పాటు సీజేపీ నేత‌లు ఆందోళ‌న చేస్తున్న నేప‌థ్యంలో మిల్‌బెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సీజేపీ నేత అభిజీత్ దీప్కేతో పాటు అత‌ని పార్టీకి అమెరిక‌న్లు విరాళాలు ఇస్తున్నార‌ని, ప్రధాని మోదీకి వ్య‌తిరేకంగా ఆ విరాళాలను అందిస్తున్నార‌ని అమెరిక‌న్ సింగ‌ర్ మిల్‌బెన్ వెల్లడించారు.

ఇప్పుడు మౌనంగా ఉండాల్సిన స‌మ‌యం కాదు అని, అంద‌మైన దేశ యువ‌త శాంతియుత రీతిలో విచ్ఛిన్నక‌ర శ‌క్తుల‌తో పోరాడాల‌న్నారు. యువ దేశ‌భ‌క్తులారా, భ‌యం వ‌ద్దు, మీ ప్రధాని.. భార‌త్‌కు 25 ఏళ్లు సేవ చేశార‌ని, 12 ఏళ్లు ప్రధానిగా వ‌రుస‌గా మూడుసార్లు ఎన్నిక‌య్యార‌ని, విచ్చిన్నక‌ర శ‌క్తుల‌కు ఆయ‌న త‌లొగ్గర‌న్నారు. ప్రపంచ‌వ్యాప్తంగా దాత‌ల‌కు ఓ ప్రత్యేక విధానం ఉంటుంద‌ని, ఎక్కడైనా క‌న్జర్వేటివ్ నేత‌ల్ని టార్గెట్ చేస్తార‌ని, అమెరికాలో చదువుకున్న వ్యక్తుల‌ను గుర్తించి, వారిని ర్యాడిక‌లైజ్ చేసి, ఆయా దేశాల‌కు పంపిస్తార‌ని వెల్లడించారు.వారు గంద‌ర‌గోళం, విధ్వంసం సృష్టించేందుకు ఫండింగ్ చేస్తార‌ని,అయితే ఇప్పటి వ‌ర‌కు ఎవ‌రూ స‌క్సెస్ కాలేద‌న్నారు. లాంటి వాళ్లు అభివృద్ధికి, ప‌రిపాల‌న‌కు అడ్డుప‌డుతుంటార‌ని మిల్‌బెన్ తెలిపారు.

స్వేచ్ఛను ఉన్నతంగా నిలిపేందుకు కౌంట‌ర్‌గా ఓ ఉద్యమం:- ప్రజాస్వామ్యం, స్వేచ్ఛను ఉన్నతంగా నిలిపేందుకు కౌంట‌ర్‌గా ఓ ఉద్యమం అవ‌స‌రం అవుతుంద‌ని అమెరిక‌న్ సింగ‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు. భార‌త్‌లో కొత్త గ‌ళం ఉద్భవించాల‌ని, ఈ నేల‌లో చ‌దివిన వ్యక్తులు ముందుకు రావాల‌ని సూచించారు. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ విచ్చిన్నర ఉద్యమాలను శాంతియుతంగా దెబ్బతీయాల‌ని, దీని కోసం ఈ దేశ యువ‌త మేలుకోవాల‌ని అన్నారు.

ఆఫ్రిక‌న్‌-అమెరికన్ హాలీవుడ్ న‌టి, గాయ‌ని అయిన మిలిబెన్ ఇటీవ‌ల ఇండియాలో ఫేమ‌స్ అయ్యారు. దేశభక్తిని చాటే ప్రదర్శనలకు పేరుగాంచిన మిల్బెన్, 2022లో భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయంలో వెలుగులోకి వచ్చారు. భార‌త జాతీయ గీతంతో పాటు ఓం జై జ‌గ‌దీశ హ‌రే పాట‌ల‌ను ఆమె పాడారు. 2023లో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటన చేసిన‌ప్పుడు ఆ కార్యక్రమంలో మిలిబెన్ జ‌న‌గ‌ణ‌మ‌ణ ఆలపించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *