AP&TGDEVOTIONALOTHERS

శ్రీకాళహస్తీ బ్రహ్మోత్సవాలు-హంస వాహనంలో విహరించిన కాళహస్తీశ్వరుడు

శ్రీకాళహస్తీ: భవహరుడు శ్రీకాళహస్తీశ్వరుడు హంస వాహనంలో విహరించారు. శ్రీకాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం మూడో తిరునాళ్లు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ముక్కంటీసుడు హంస వాహన రూపుడై భక్తకోవిధులను కనువిందు చేశారు. సరసనే జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు యాలివాహనాన్ని అధిరోహించి వెంట సాగారు. భక్త కన్నప్ప చండీకేశ్వరుడు స్వామి అమ్మవార్ల వాహన సేవలు నడుస్తూ దారి చూపగా, వెనుకనే వినాయక స్వామి, సుబ్రహ్మణ్యస్వామి అనుసరించారు. శివుడు, అమ్మవారు ఆనందమూర్తులుగా కాన వచ్చిన పుణ్యక్షణాలవి, అలోకికానంద భక్తజన సందోహ సన్నాహమిది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *