NATIONAL

ఇక నుంచి 30 రోజులకు ఒక సారి రీచార్జీ ప్లాన్లు-ట్రాయ్

మొబైల్ వినియోగదారులకు శుభవార్త..

అమరావతి: టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI)  టెలికాం వినియోగదారుల రక్షణ (13వ సవరణ) నిబంధనలు, 2026ను ట్రాయ్ విడుదల చేసింది. ఇప్పటివరకు ఉన్న 28 రోజుల సైకిల్ ప్లాన్లు కాకుండా, నెలకు ఒకసారి మాత్రమే రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం అమల్లో వున్న 28 రోజుల సైకిల్ ప్లాన్ల వల్ల వినియోగదారులు సంవత్సరానికి 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చేది. ఈ కొత్త నిబంధనల వల్ల వినియోగదారులు నెలకు ఒకసారి (ఏడాదికి 12 సార్లు) మాత్రమే రీఛార్జ్ చేసుకోవచ్చు.

వాయిస్, SMS-ఓన్లీ ప్లాన్లు: ఇంటర్నెట్ డేటా అవసరం లేకుండా, కేవలం సాధారణ కాల్స్, మెసేజ్‌ల (SMS) కోసం మాత్రమే ఫోన్ ఉపయోగించే తక్కువ బడ్జెట్ వినియోగదారులకు అనుగుణంగా ప్రత్యేకమైన చౌకైన ‘Special Tariff Vouchers (STVs)’ అందుబాటులోకి రానున్నాయి. నెలవారీ ఒకే తేదీన రీఛార్జ్: దీంతో ఇకపై ప్రతి నెలా ఒకే తేదీన రీఛార్జ్ అయ్యే ప్లాన్లను టెలికాం కంపెనీలు కస్టమర్లకు అందించాల్సి ఉంటుంది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *