NATIONAL

యూపీఐ క‌మ‌ర్షియ‌ల్ లావాదేవీలు రూ.2 వేలు దాటితే పన్ను విధించడంపై స్టేకు నిరాకరించిన సుప్రీం

అమరావతి: యూపీఐ క‌మ‌ర్షియ‌ల్ లావాదేవీలు రూ.2 వేలు దాటితే,ADR వ‌సూల్ చేయ‌నున్న‌ట్లు కేంద్రం ఇటీవల వెల్లడించింది. అడ్వ‌కేట్ అంజ‌న్ ద‌త్తా పిటీష‌న్ దాఖలు చేశారు. చీఫ్ జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, జ‌స్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, వీ మోహ‌న‌తో కూడిన ధ‌ర్మాసనం సోమవారం రిట్ పిటీష‌న్‌ను స్వీక‌రించింది. సెప్టెంబ‌ర్ 14, 15 తేదీల్లో కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన గెజిటెడ్ నోటిఫికేష‌న్ల‌ను స‌వాల్ చేస్తూ కోర్టులో పిల్ దాఖ‌లు చేశారు. ఈ పిటీషన్ పై నాలుగు వారాల్లోగా ఎండీఆర్ ప‌న్నుపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కేంద్రం ప్రభుత్వం, RBI,NCPIల‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. చ‌ట్టప‌రంగా ఇది చిన్న స‌మ‌స్య అని, అయితే సాంకేతికంగా పెద్ద స‌మ‌స్య‌గా ఉంద‌ని కోర్టు అభిప్రాయం వ్యక్త చేసింది. ఎండీఆర్ వ‌సూల్ చేయాల‌నుకోవ‌డం ప‌న్ను లేక ఫీజా అని కోర్టు ప్రశ్నించింది. ఒక‌వేళ ఫీజు కాకుంటే ఆదేశాలు ఎందుక‌ని ప్ర‌శ్నించింది.వ్యాపారిపై ఎండీఆర్‌ను వ‌సూల్ చేయాల‌నుకుంటున్న కేంద్రం ఆదేశాల‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాక‌రించింది. 2 వేల ట్రాన్స్‌ ఫ‌ర్ దాటితే, అక్టోబ‌ర్ 15 నుంచి ఎండీఆర్ ఛార్జీలు వ‌సూల్ చేయ‌నున్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *