INTERNATIONALNATIONALOTHERS

194 ఏళ్లు వయస్సు వున్న అతిధిని కలుసుకోనున్న ప్రధాని మోదీ

అమరావతి: 1832లో పుట్టిన తాబేలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలుసుకోనున్నారు. హిందూ మ‌హాస‌ముద్ర ద్వీపం సీషెల్స్‌ లో ప్ర‌ధాని ప‌ర్య‌టించ‌నున్నారు. భార‌త్‌, సీషెల్స్ మ‌ధ్య 50 ఏళ్ల దౌత్య బంధానికి ప్ర‌తీక‌గా ప్ర‌ధాని మోదీ ఈ ప‌ర్య‌ట‌న చేప‌ట్టనున్నారు. సీషెల్స్ జాతీయ దినోత్స‌వ సంబ‌రాల్లో ప్రధాని మోదీ గౌర‌వ అతిథిగా పాల్గొంటారు. ఆ ప‌ర్య‌ట‌న సందర్బంలో ప్రధాని అక్క‌డ నేష‌న‌ల్ బోటానిక‌ల్ గార్డెన్స్ వెళ్ల‌నున్నారు. షెడ్యూల్ ప్ర‌కారం ఆయ‌న అక్క‌డ ఓ వృక్షాన్ని నాట‌నున్నారు. అదే సమయంలో ప్ర‌పంచంలో ప్రాణాల‌తో ఉన్న‌ అతి వృద్ధ జంతువును అయిన తాబేలు జోనాథ‌న్‌ ప్ర‌ధాని మోదీ క‌లుసుకోనున్నారు.ఇప్పుడు దానికి సుమారు 194 ఏళ్లు ఉంటుంద‌ని గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ అంచ‌నా వేసింది. దాదాపు రెండు శ‌తాబ్ధాల‌ వయస్సుకు చేరుకున్న ఆ ఈ తాబేలు ఎన్నో చ‌రిత్రాత్మ‌క సంద‌ర్భాల‌కు సాక్షీగా నిలిచింది. వ‌య‌సు మీరినా ఆ తాబేలు మాత్రం ఆరోగ్య‌క‌రంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. వెట‌ర‌ర్నీ డాక్ట‌ర్లు దాని ఆరోగ్యాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రీక్షిస్తున్నారు. వ‌య‌సు రీత్యా ఆ తాబేలుకు కంటి చూపు మంద‌గించింది. వాస‌న గుర్తుప‌ట్టే గుణాన్ని కూడా కొంత కోల్పోయిన‌ట్లు తెలుస్తోంది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *