DISTRICTS

అందరి సహకారంతో నగరాన్ని అభివృద్ధి పథంలోకి నడుపుతాం-మేయర్ స్రవంతి

నెల్లూరు: జిల్లాకు చెందిన అందరు ప్రజా ప్రతినిధుల సహకారంతో, నెల్లూరు నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారుల పర్యవేక్షణలో నగరాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తామని కార్పొరేషన్ మేయర్ స్రవంతి పేర్కొన్నారు. నగర పాలక సంస్థ సాధారణ సర్వ సభ్య సమావేశాన్నికార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలామ్ కౌన్సిల్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. మేయర్ స్రవంతిజయవర్ధన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర పాలక సంస్థ అన్ని డివిజనుల కౌన్సిల్ సభ్యుల సమక్షంలో ప్రవేశపెట్టిన 73 తీర్మానాలను అజెండాగా ప్రకటించగా, 64 తీర్మానాలను కౌన్సిల్ ఆమోదించారు. అజెండాలో 4 తీర్మానాలను తదుపరి కౌన్సిల్ సమావేశానికి వాయిదా వేయగా, 5 తీర్మానాలను రివైజ్ చేయడం జరిగింది. అనంతరం ప్రజా ప్రతినిధులు తమ డివిజన్ల పరిధిలో ప్రస్తావించిన పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైను కాలువల పూడికతీత, దోమల నిర్మూలన, కుక్కలు, పందులు, పశువుల నియంత్రణతో పాటు స్థానిక సమస్యలను, వివిధ అంశాలను పరిష్కరించేందుకు కార్పొరేషన్ అధికారులు పూర్తి స్థాయిలో కృషి చేయాలని మేయర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ చంద్ర శేఖర్ రెడ్డి, నగర పాలక సంస్థ అన్ని డివిజనుల కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కమిషనర్ సూర్యతేజ, నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *