NATIONAL

సరికొత్త చరిత్ర సృష్టించనున్నప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. జున్ 10వ తేదిన భారతదేశంకు అత్యధిక కాలం పని చేసిన ప్రధాన మంత్రిగా నిలవనున్నారు. ఎక్కువ రోజులు ప్రధానిగా కొనసాగిన జవహర్ లాల్ నెహ్రూ చరిత్రను దాటేయబోతున్నారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ మే 13, 1952న పదవీ బాధ్యతలు చేపట్టారు. మే 27, 1964న ఆయన మరణించేవరకు ప్రధానిగానే ఉన్నారు. అలా మొత్తం 4,398 రోజులు ప్రధానిగా కొనసాగారు. ఇప్పటి వరకు ఉన్న ఈ రికార్డును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 10వ తేదిన చెరిపేయనున్నారు. ఈ నెల 10వ తేదితో నరేంద్ర మోదీ ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకుంటారు.నరేంద్ర మోదీ మొదటిసారిగా మే 26, 2014వ తేదిన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన ప్రధానిగా కొనసాగుతున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *