180 మంది ప్రయాణికులను ప్రాణాలకు కాపాడిన భారతీయ పైలట్
అమరావతి: దుబాయ్ దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుధవారం ఉదయం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ (FZ1073) విమానంలో ఉగ్రవాద ప్రయత్నాన్ని అదే విమానానికి కెప్టెన్‌గా ఉన్న ఓ భారతీయ పైలట్ అడ్డుకున్నారు. ఒమన్ కు చెందిన కో-పైలట్ మడత కత్తితో దాడి చేసినప్పట్టికి, ప్రాణాలకు తెగించి మరీ ఆయన 180 మంది ప్రయాణికులను కాపాడారు. ఓవైపు దాడిని ఎదుర్కొంటూనే, 34 వేల అడుగుల ఎత్తు నుంచి ఒక్క సారిగా 16 వేల అడుగులకు పడిపోతున్న విమానంను, కూలిపోకుండా నియంత్రించారు. అనంతరం ఫ్లైదుబాయ్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు విమానాన్ని సురక్షితంగా సౌదీ అరేబియాలో ల్యాండ్ చేశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌కు చెందిన వార్త సంస్థలు వెల్లడించాయి. దాడిలో భారతీయ కెప్టెన్‌కు గాయాలయ్యాయి.

