CRIMENATIONAL

ఢిల్లీ ఎర్రకోట పేలుళ్లతో సంబంధం ఉన్న మరో ముగ్గురు డాక్టర్లు, ఒక మత బోధకుడు అరెస్ట్

అమరావతి: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్లతో సంబంధం ఉన్న మరో నలుగురు మతోన్మాదులను NIA శ్రీనగర్‌లో గురువారం అరెస్ట్ చేసింది..ఈ మారణహోమంతో సంబంధం ఉన్న వారి సంఖ్య ఇప్పటి వరకు 6కు చేరుకున్నాయి..

ముఖ్యమైన పాత్ర పోషించిన డాక్టర్లు:- మారణహోమంతో సంబంధం వారి మూలాలను NIA త్రవ్వి తీస్తొంది..ఇందులో బాగంగా జిల్లా సెషన్స్ జడ్జి,, పాటియాలా హౌస్ కోర్టు జారీ చేసిన ఆర్డర్ల మేరకు నలుగురు నిందితులను జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో NIA అధికారులు అదుపులోకి తీసుకున్నారు..అరెస్ట్ చేసిన వారిలో జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనై, జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌కు చెందిన డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోకు చెందిన డాక్టర్ షాహీన్ సయీద్, జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్‌కు చెందిన ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వాగేగా గుర్తించారు. వీరందరూ ఢిల్లీ మారణహోమంలో ముఖ్యమైన పాత్ర పోషించారని దర్యాప్తు పేర్కొంది..      

మారణహోమంలో 15 మంది:- ఈ పేలుడు సంఘటన జరిగిన వెంటనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీనిపై దర్యాప్తును NIA కి అప్పగించింది..దాడికి కారణమైన గ్రూపులోని ప్రతి సభ్యుడిని గుర్తించి అరెస్టు చేయడానికి ఏజెన్సీ వివిధ రాష్ట్ర పోలీసు దళాలతో కలిసి పనిచేస్తోంది..నవంబర్ 10వ తేదిన ఢిల్లీలోని నేతాజీ సుభాష్ మార్గ్‌ లో మతోన్మాదులు జరిపిన మారణహోమంలో 15 మంది అమాయకులైన పౌరులు మరణించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *