INTERNATIONALNATIONALOTHERS

AIతో మీ వ్యక్తిగత విషయాలు రహస్యంగా ఉంటాయని భావించ వద్దు-ఓపెన్‌ఏఐ సీఈఓ

అమరావతి: చాట్‌జీపీటీ (ChatGPT) ఆర్టిఫియల్ ఇంటెజెన్స్ తో టూల్ తో చాలామంది త‌మ మనసులోని బాధలు, ప్రేమ వ్యవహారాలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ ఆందోళనలు లాంటి జీవితంలోని అత్యంత వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నారు.ఈలాంటి మీ వ్యక్తిగత విషయాలు,సంభాషణలు పూర్తిగా రహస్యంగా ఉంటాయని భావించొద్దని ఓపెన్‌ఏఐ సీఈఓ (Open AI CEO) సామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman) హెచ్చరించారు. కొన్ని సందర్భాల్లో చాట్‌ రికార్డులు చట్టపరమైన విచారణల్లో బయటకు వచ్చే అవకాశం ఉందని కుండబద్దలు కొట్టారు.ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సామ్‌ ఆల్ట్‌మన్‌ మాట్లాడుతూ, ముఖ్యంగా యువత చాట్‌జీపీటీని థెరపిస్ట్‌ (Therapist), లైఫ్‌ కోచ్‌ (Life Coach) లాంటి టూల్స్ ను ఉపయోగిస్తున్నరని వెల్లడించారు.

వ్యక్తుల మధ్య బంధాల్లో సమస్యలు, మానసిక ఒత్తిడి, వ్యక్తిగత నిర్ణయాలపై ఏఐ సలహా తీసుకుంటున్నారని, వైద్యుడు, న్యాయవాది లేదా మానసిక వైద్యుడితో మాట్లాడినప్పుడు ఉండే చట్టపరమైన గోప్యత చాట్‌జీపీటీ సంభాషణలకు ప్రస్తుతం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ కోర్టు లేదా దర్యాప్తు సంస్థలు చట్టబద్ధంగా సమాచారం కోరితే, అవసరమైన సందర్భాల్లో చాట్‌ రికార్డులను అందించాల్సి రావచ్చని అన్నారు.

అమెరికాలో న్యూయార్క్‌ టైమ్స్‌ దాఖలు చేసిన కాపీరైట్‌ కేసులో ఫెడరల్‌ కోర్టు ఆదేశాల మేరకు ఓపెన్‌ఏఐ కొంత చాట్‌జీపీటీ లాగ్‌ డేటాను భద్రపరచాల్సి వచ్చింది. ఈ పరిణామం కూడా AI Chatల గోప్యతపై చర్చకు దారితీసిందన్నారు. నిపుణుల అభిప్రాయం మేరకు నేరానికి సంబంధించిన సమాచారం, చట్టపరమైన వివాదాలకు సంబంధించిన వివరాలు లేదా దర్యాప్తులో కీలకంగా మారే అంశాలు చాట్‌జీపీటీలో ఉంటే అవి భవిష్యత్తులో ఆధారాలుగా ఉపయోగించే అవకాశం ఉందన్నారు. వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌ లు, బ్యాంకింగ్‌ వివరాలు, అధికారిక రహస్యాల వంటి అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఏ AI Chat Batలోనూ పంచుకోకుండా జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ భద్రత నిపుణులు సూచిస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *