AP&TG

16 మంది వీర విధేయ ఐపీఎస్‌లకు మెమోలు ఇచ్చిన డీజీపీ

అమరావతి: గత ప్రభుత్వానికి వీర విధేయులుగా పనిచేసి,,ఆరోపణలు ఎదుర్కొన్న ఐపీఎస్‌లను కూటమి ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ లు ఇవ్వకుండా వెయింటింగ్ వుంచింది..అయితే వెయిటింగ్‌లో ఉన్న 16 మంది IPSలకు మెమోలు జారీ చేయడం సంచలనం సృష్టిస్తుంది.. వెయిటింగ్‌లో ఉండి హెడ్‌క్వార్టర్స్‌ లో అందుబాటులో లేని ఐపీఎస్‌ అధికారులకు DGP ద్వారకా తిరుమలరావు బుధవారం మెమోలు జారీ చేశారు.. PSR ఆంజనేయులు, సునీల్‌కుమార్,,కాంతిరాణా టాటా,, పరమేశ్వర్‌ రెడ్డి,, రవిశంకర్‌రెడ్డి,,పాలరాజు,,అమ్మిరెడ్డి,,విజయరావు,,జాషువా,,‌ కొల్లి రఘురామిరెడ్డి,, రిషాంత్‌రెడ్డి,, రఘువీరారెడ్డి,, కృష్ణకాంత్ పటేల్‌తో పాటు మరికొందరికి మెమోలు జారీ చేశారు.. వీరంతా ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు డీజీపీ కార్యాలయంలోనే ఉండాలని,, విధుల ముగిశాక హాజరు పట్టికలో సంతకం చేసి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు..ప్రతి రోజు హెడ్‌ క్వార్టర్స్‌ లో రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *