INTERNATIONALNATIONALOTHERS

బ్రిక్స్ దేశాలు నింబధనలు పాటించే స్థితి నుంచి నింబధనలు రూపొందించే దిశగా ఎదగాలి-ప్రధాని మోదీ

అమరావతి: బ్రిక్స్ కూట‌మి ఎవ‌రికీ వ్య‌తిరేకం కాద‌ని ప్ర‌ధాని మోదీ స్ప‌ష్టం చేశారు. శని,ఆదివారల్లో ఢిల్లీలోని భార‌త్ మండ‌పంలో జ‌రుగుతున్న బ్రిక్స్ స‌ద‌స్సు ప్రారంభం సంద‌ర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. బ్రిక్స్ స‌ద‌స్సు ఎవ‌రికీ వ్య‌తిరేకం కాదంటూ…బ్రిక్స్ కూట‌మి విష‌యంలో యూర‌ప్ దేశాల‌కు ఉన్న సందేహాల‌పై ప్రధాని మోదీ స్పష్టత ఇచ్చారు. గ్లోబ‌ల్ సౌత్ (ద‌క్షిణ ప్రాంత‌పు దేశాలు) రూల్స్ పాటించే దేశాలుగ కాకుండా వాటిని రూపొందించే శ‌క్తిగా ఎద‌గాలని అకాంక్షించారు.

ఐక్యరాజ్య‌స‌మితిలో సంస్క‌ర‌ణ‌లు:- ఐక్య‌రాజ్య‌స‌మితిలోనూ స‌వ‌ర‌ణ‌లు జరగాల్సిన అవ‌స‌రం వుందని,అలాగే అన్ని దేశాల‌కు భాగ‌స్వామ్యం కావాలని, అన్ని దేశాలు త‌మ గొంతుక వినిపించే వేదిక కావాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్రిక్స్‌ ను బ‌లోపేతం చేస్తూనే ప్ర‌పంచ‌స్థాయి సంస్క‌ర‌ణ‌ల కోసం ఒక మార్గాన్ని రూపొందించాలన్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప్ర‌పంచ వ్య‌వ‌స్థ ఒక పిర‌మిడ్‌లాగా ఉందని, అధికారం, బ‌లం, ఆదిప‌త్యం, నిర్ణ‌యాలు తీసుకునేవ‌న్నీపిరమిడ్ పైన ఉండే దేశాలు కాగా కింద ఉండే దేశాలు వీటివ‌ల్ల ప్ర‌భావితం అవుతున్నాయని వెల్లడించారు.ఈ దేశాలు అవి త‌మ‌ను తాము సొంతంగా నిర్మించుకోలేక పోతున్నాయని,ఇలాంటి సమయంలో ఐక్యరాజ్య‌స‌మితిలో సంస్క‌ర‌ణ‌లు తీసుకురావ‌డాన్ని ఆల‌స్యం చేయ‌కుండా, ఈ విష‌యంలో చ‌ర్చ‌ల‌కు నిర్ణీత కాల‌వ్య‌వ‌ధిని నిర్ణ‌యించుకోవాలన్నారు.

స‌ముద్ర మార్గాలు సుర‌క్షితంగా ఉండాలి:- ఓటు హ‌క్కు, నాయ‌క‌త్వ స్థాయిలు, పాల‌సీలు రూపొందించ‌డం వంటివ‌న్నీ నేటి ఆర్థిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఉండాలి అన్నారు. ఇదే స‌మ‌యంలో ఇటీవ‌లి కాలంలో నౌక‌ల‌పై దాడులు జ‌రుగుతూ, సముద్రంపై నావికుల‌కు క‌లుగుతున్న ఇబ్బందుల్ని ప్రధాని మోదీ ప్ర‌స్తావించారు. స‌ముద్ర మార్గాలు సుర‌క్షితంగా ఉండాల‌ని, నావికుల‌ను, సిబ్బందిని ర‌క్షించుకునేందుకు అత్య‌వ‌స‌ర వ్య‌వ‌స్థ‌ను రూపొందించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌పంచ వాణిజ్యానికి ఇది ఎంతో అవ‌స‌రం అన్నారు. ఐరాస‌లో అనేక దేశాల‌కు శాశ్వ‌త స‌భ్య‌త్వం క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్పష్టం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *