AP&TG

కడపజిల్లా ఒంటిమిట్టలో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత-విపత్తుల నిర్వహణ సంస్థ

అమరావతి: రాష్ట్రంలో మంగళవారం మార్కాపురం జిల్లా కంభం, కడపజిల్లా ఒంటిమిట్టలో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మొత్తం 28 జిల్లాలకు గాను 16 జిల్లాల పరిధిలోని 140 మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండి 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు వెల్లడించారు.

ఎండలు తీవ్రత:- మంగళవారం మార్కాపురం(జి) కంభం, వైఎస్సార్ కడప(జి) ఒంటిమిట్టలో 44.3°C, నంద్యాల(జి) ఆళ్లగడ్డలో 44.1°C, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు(జి) కొమ్మిపాడులో 43.8°C, చిత్తూరు(జి) తవణంపల్లెలో 43.6°C, పల్నాడు(జి) గురజాలలో 43.2°C, ప్రకాశం(జి) కొప్పెరపాడులో 42.8°C,  అనంతపురం(జి) రాయదుర్గంలో  42.4°C, కాకినాడ(జి) కరపలో 42.3°C, కర్నూలు(జి) నగరడోనలో 42.2°C, అన్నమయ్య(జి) గాలివీడు, తిరుపతి(జి) వెంకటగిరిలో 42.1 చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *