AP&TGDEVOTIONALOTHERS

శ్రీవారి బ్రహ్మోత్సవాలపై సమీక్ష-నిర్దేశిత సమయంలోపు ఏర్పాట్లు పూర్తి చేయాలి ఆదనపు ఈవో

తిరుమ‌ల‌: అధిక‌మాసం కార‌ణంగా తిరుమలలో ఈ ఏడాది రెండు బ్ర‌హ్మోత్స‌వాలు నిర్వ‌హిస్తున్న‌ నేపథ్యంలో ప్రణాళికలు రూపొందించి నిర్దేశిత సమయంలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్‌.వెంకయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలపై తిరుమలలోని ప‌ద్మావ‌తి అతిథిగృహంలో ఉన్న సుధ‌ర్మ స‌మావేశ మందిరంలో గురువారం ఆయన తిరుప‌తి జేఈవో డాక్ట‌ర్ ఏ.శ‌ర‌త్, సీవీఎస్వో మురళీకృష్ణలతో క‌లిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టబోయే ఏర్పాట్లపై విభాగాల వారీగా సమీక్షించి పలు సూచనలు చేశారు.

శ్రీ‌వారి సాల‌కట్ల బ్ర‌హ్మోత్స‌వాలు..

  • 08-09-2026 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
  • 14-09-2026 శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
  • 15-09-2026 ధ్వజారోహణం.
  • 19-09-2026 గరుడ వాహనం.
  • 22-09-2026 రథోత్సవం.
  • 23-09-2026 చక్రస్నానం.
  • ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు.
  • బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.
  • వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలు కూడా రద్దు.
  • భక్తులకు దర్శన క్యూలైన్లు, మాడ వీధుల్లోని గ్యాలరీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో విరివిగా అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశం.
  • భక్తులను ఆకట్టుకునే విధంగా విద్యుత్ అలంకరణలు, ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆదేశం.
  • శ్రీవారి సేవకులుగా యువతీ, యువకులను ఆహ్వానించి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆదేశం.
  • గ‌రుడ‌సేవ‌కు విచ్చేసే భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని 18-09-2026 రాత్రి 9 నుండి 20-09-2026 ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతి నిరాకరణ.
  • భక్తుల రద్దీకి తగినవిధంగా లడ్డూలు నిల్వ ఉంచుకోవాలని ఆదేశం.

ఈ స‌మావేశంలో సీఈ స‌త్య నారాయ‌ణ‌, డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, రాజేంద్ర, సోమన్నారాయణ, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, సీఎంఓ డాక్ట‌ర్ కుసుమ కుమారి,  డిఈ చంద్ర శేఖర్, వీజీవో సురేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి జీ.ఎల్.ఎన్. శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *