DISTRICTS

అమరవీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగస్ఫూర్తి యువతకు ఆదర్శం-కలెక్టర్ హిమాన్షు శుక్ల

నెల్లూరు: దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగం, ధైర్యసాహసాలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్  హిమాన్షు శుక్ల అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం, బ్రిటిష్ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ, జిల్లా రెవిన్యూ అధికారి విజయ్ కుమార్, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, సెట్నల్ ఇన్చార్జి సీఈఓ శ్రీధర్ బాబు, మేనేజర్ శ్రీనివాసులుతో పాటు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొని అల్లూరి సీతారామరాజుకు ఘనంగా నివాళులర్పించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *