DISTRICTS

బీసీ డెడికేటెడ్ కమిషన్ కు వినతి పత్రం అందచేసిన నెల్లూరు జిల్లా బొందిలి సంఘం

నెల్లూరు: కలెక్టరేట్ ప్రాంగణంలోని తిక్కన భవన్‌లో, గురువారం సుప్రీంకోర్టు నియమించిన బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా (రిటైర్డ్ ఐఏఎస్),కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని వినతి పత్రం అందచేసినట్లు నెల్లూరు జిల్లా బొందిలి సంఘం ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. బొందిలి కులాన్ని ఇతర వెనుకబడిన వర్గాల (OBC) జాబితాలో చేర్చవలసిందిగా కోరుతూ నెల్లూరు జిల్లా బొందిలి సంఘం తరఫున కమిషన్ చైర్మన్ కి వినతిపత్రాన్ని సమర్పించడం జరిగిందని తెలిపారు. బొందిలి కులం యొక్క సామాజిక, విద్యా-ఆర్థిక పరిస్థితులను వివరించి, ఓబీసీ హోదా కల్పించడం ద్వారా సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బొందిలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు నెల్లూరు కృష్ణ సింగ్,ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీధర్ సింగ్రు, బొందిలి కార్పొరేషన్ మాజీ చైర్మన్ కిషోర్ సింగ్,జిల్లా బొందిలి సంఘం అధ్యక్షులు ఆర్.శ్రీనివాస్ సింగ్,సెక్రటరీ నాగేంద్ర సింగ్, కోటి సింగ్, మహిళా సెక్రటరీ శ్రీమతి లలితా భాయ్,తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *