కార్పరేషన్ డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియపై కోర్టు స్టే-ఎమ్మేల్సీ చంద్రశేఖర్ రెడ్డి
నెల్లూరు: నగరపాలక సంస్థ డీలిమిటేషన్ ప్రక్రియ అస్తవ్యస్త విధానాలతో, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నేపధ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి వైసిపి కార్పొరేటర్లు హైకోర్టులో కేసు దాఖలు చేశారు. పిటీషన్ పై విచారించిన హైకోర్టు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ, నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని భావించి స్టే విధించింది.
డివిజన్ల సరిహద్దులను మార్చివేసి, కొత్త డివిజన్లు ఏర్పాటు చేసిన విధానం ప్రజామోదయోగ్యంగా లేకపోవడంతో హైకోర్టు స్టే ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అస్తవ్యస్థంగా జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియ నిలుపుదల చేయడంలో వైసీపీ విజయం సాధించిందని పేర్కొన్నారు.

