AP&TG

రాయలసీమ ప్రాంతాలు తాకిన నైరుతి రుతుపవనాలు-ఐఎండీ

గరిష్ట ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గే అవకాశం…

అమరావతి: శనివారం(జూన్ 6) నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతాలు తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.రాష్ట్రం అంతటా విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. రుతుపవనాలు పశ్చిమ మధ్య-తూర్పు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, గోవా మొత్తం, మహారాష్ట్ర-ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని భాగాలు, తమిళనాడులోని చాలా ప్రాంతాలు విస్తరించాయని వెల్లడించింది.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం- రాబోయే మూడు రోజుల వాతావరణ వివరాలు:- తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.ఈదురు  గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:- తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు  చోట్ల కురిసే అవకాశముంది. ఈదురు  గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది  .

రాయలసీమ:- తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన  జల్లులు కొన్ని చోట్ల  కురిసే అవకాశముంది.భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈదురు  గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

గమనిక:- కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం-రాయలసీమ ప్రాంతాలలో రాబోయే 5 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పులేకుండానే కొంచెం తగ్గే అవకాశముంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *