NATIONALOTHERSWORLD

భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్‌ కు లండ‌న్‌లో అవమానం

అమరావతి: భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్‌కు లండ‌న్‌లో అవమానం జరిగింది.బిర్క్‌ బెక్ కాలేజీలో ఆయ‌న ప్ర‌సంగాన్ని అడ్డుకున్నారు. జూన్ 4వ తేదీన లండ‌న్ కాలేజీలో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంట‌ర్నేష‌న‌ల్ లా అన్న అంశంపై ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. క్వ‌శ్చ‌న్ అండ్ ఆన్స‌ర్ సెష‌న్‌లో కొంద‌రు భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిని అవమానించేందుకు,ఒక ప్రథకం ప్రకారం హాజ‌రైయ్యారు, భార‌త్‌లో భావ‌స్వేచ్ఛ లేద‌ని, నిరుద్యోగుల‌ను బొద్దింక‌ల‌తో పోల్చ‌డాన్ని ప్ర‌శ్నిస్తూ కామెంట్లు చేశారు. అయితే ఆ ప్ర‌శ్నోత్త‌రాల ఈవెంట్‌ను నిర్వాహ‌కులు త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేశారు.

అభ్యతరకరం:- లండన్ లో భావ ప్రకటన స్వేచ్చ పేరుతో లెప్ట్ భావజలం వున్న గ్రూప్ లు రెచ్చిపోతున్నాయి. భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తికు జరిగిన అవమానంపై భారత విదేశంగాశాఖ ఘాటుగా బదులు ఇచ్చింది. మర్యాద‌పూర్వ‌కంగా జ‌ర‌గాల్సిన ఈవెంట్‌లో ప్రేక్ష‌కుల ప్ర‌వ‌ర్త‌న అభ్యతరకరంగ వుందని, ఆమోదయోగ్యం కాదని, అస‌మ‌ర్థ‌నీయం అంటూ త‌న ప్ర‌క‌ట‌న‌లో హై క‌మిష‌న్ పేర్కొంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *