NATIONALPOLITICS

మమతా బెనర్జీకి ఎదురు తిరిగిన 58 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు

అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి అయిన మమతా బెనర్జీకి స్వపక్షం ఎమ్మేల్మే నుంచే గట్టి షాక్ తగిలింది.58 మంది ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు చేశారు. వారంతా కలిసి అసెంబ్లీ స్పీకర్‌‌కు లేఖ సమర్పించారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన రితబ్రతా బెనర్జీని తమ పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలని,అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్‌కు విజ్ఞప్తి చేశారు.

బుధవారం పార్టీ నుంచి సస్పెండ్ అయిన రితబ్రతా బెనర్జీని అధ్యర్యంలో 58 మంది ఎమ్మేల్యేలు ప్రత్యేక బస్సుల్లో బెంగాల్ అసెంబ్లీకి చేరుకున్నారు. 58 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతగా రితబ్రత పేరు సూచిస్తూ మద్దతు నిలిచారు. దింతో పార్టీ గుర్తుపై గెలిచిన 80 మందిలో 60 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే మమత పార్టీలో 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారు.ఈ అంశంపై ఇప్పటివరకు మమతా బెనర్జీకానీ, టీఎంసీ అగ్రనాయకత్వం కానీ స్పందించలేదు.ఇదే సమయంలో టీఎంసీ అగ్రనేత అభిషేక్ కల్యాణ్ బెనర్జీ తాజాగా ఎక్స్‌ లో స్పందించారు.శోభన్‌దేవ్ ఛట్టోపాధ్యాయను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోరారు. అయితే ప్రస్తుతం అత్యధిక శాతం ఎమ్మెల్యేలు రితబ్రతకు మద్దతు పలకడంతో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రితబ్రతనే ప్రతిపక్ష నేతగా గుర్తిస్తే మమత ఆధ్వర్యంలోని టీంఎసీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. బెంగాల్ లో నానాటికి తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థితికి దిగజారి పోతొంది వేచిచూడాలి.?  

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *