AP&TG

పల్నాడు(జి) పిడుగురాళ్లలో 48.1,(నెల్లూరు)కావలిలో 46.4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు

సోమవారం వరకు..

అమరావతి: రాష్ట్రంలో ఎండ ఉధృతి తీవ్ర రూపం దాల్చుతోందని, ఇదే సమయంలో వేడి గాలులు తొడు కావడంతో, ప్రజలు రోడ్లపైకి రావలంటేనే భయపడుతున్నారు.

గురువారం (21-05-2026) జిల్లా వారీగా నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతల మ్యాప్ పల్నాడు(జి) పిడుగురాళ్లలో 48.1డిగ్రీలు, బాపట్ల(జి) వేటపాలెం, కృష్ణా(జి) నందివాడ 47.6, ఎన్టీఆర్ (జి) తొర్రగుడిపాడు, ప్రకాశం(జి) అద్దంకిలో 47.4, ఏలూరు(జి) అల్లిపల్లిలో 47.3, మార్కాపురం(జి) నందనమారెళ్లలో 46.6, పోలవరం(జి) కూనవరంలో 46.5, నెల్లూరు(జి) కావలిలో 46.4, గుంటూరు(జి) తెనాలిలో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం వరకు ఎండ తీవ్రత కొనసాగనున్న నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 15 తీవ్ర వడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది.

ఉపరితల ఆవర్తన ప్రభావం: అల్లూరి, పోలవరం, నెల్లూరు,రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని తెలిపింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *