NATIONALOTHERSWORLD

సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

అమరావతి: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరుగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమవేశం-2026లో పాల్గొనేందుకు పుతిన్ భారతదేశం వస్తున్నారని రష్యా ప్రభుత్వ ప్రధాన కార్యాలయం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి యూరి ఉషకోవ్ మంగళవారం నాడు వెల్లడించారు.సంవత్సరం వ్యవధిలోనే పుతిన్ భారతదేశంలో పర్యటించనుండటం ఇది రెండోసారి.2025 డిసెంబర్‌లో, 23వ ఇండియా-రష్యా వార్షిక సదస్సులో పాల్గొన్నారు. పుతిన్ పర్యటనతో ఇరుదేశాల రక్షణ, వాణిజ్యం, ఇంధన రంగాల బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లనున్నదని విశ్లేషకుల అంచన.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *