AP&TG

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ పదవీ కాలం నవంబరు 30 వరకు పొడిగింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు మాసాలు అనగా జూన్ 1 నుంచి నవంబరు 30 వరకు పొడింగించింది.రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధన మేరకు కేంద్ర ప్రభుత్వం ఇందుకు ఆమోదం తెలిపింది. ఈమేరకు ఆల్ ఇండియా సర్వీసెస్(AIS) రూల్ 16(1)(DCRB)రూల్స్ 1958 కు అనుగుణంగా సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని ఆరు మాసాలకు పొడిగిస్తూ కేంద్ర డిపార్టుమెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్(డిఓపిటి)మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరి రాజేశ్ కుమార్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపపాలన శాఖ(పొలిటికల్)ముఖ్య కార్యదర్శికి లేఖ ద్వారా తెలియ జేశారు.ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న సాయి ప్రసాద్ వాస్తవానికి ఈ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన సేవలను మరికొంత కాలం వినియోగించుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ పదవీ కాలాన్ని పొడిగించాల్సిందిగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ఆమేరకు కేంద్ర ప్రభుత్వం సాయి ప్రసాద్ పదవీ కాలాన్నిపొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *