గ్రామాలలో స్థానిక సమస్యల సత్వర పరిష్కారం కోసమే పల్లె వీక్షణం-కలెక్టర్ హిమాన్షు శుక్ల
నెల్లూరు: పల్లె వీక్షణం కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఉదయగిరి మండలం అప్పసముద్రం పల్లె వీక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు, పశువుల కోసం ఏర్పాటు చేసిన నీటి తొట్టెలు, అంగన్వాడి కేంద్రం, ప్రతి సేవా కేంద్రం-మెడికల్ క్యాంపులను మినీ గోకులాన్ని పరిశీలించారు.

అనంతరం మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పల్లె వీక్షణం ముఖ్య ఉద్దేశం గ్రామంలోని సమస్యలను జిల్లా అధికారులతో కలిసి పరిశీలించి సాధ్యమైనంత మేరా అప్పటికప్పుడే పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవడం అని తెలిపారు. అప్పసముద్రంలోని ప్రైమరీ పాఠశాలలో 1 నుంచి ఐదు వరకు విద్యాబోధన చ నేర్పించే విధంగా అధ్యాపకులను నియమించే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా విద్యాశాఖ అధికారికి సూచనలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. నేషనల్ హైవే నుంచి పలు గ్రామాలకు వెళ్ళవలసిన సర్వీస్ రోడ్లు-గ్రావెల్ రోడ్ల విషయమై అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో చదువుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించిన పలువురు విద్యార్థులు వసంత కుమార్ రెడ్డి, నాగ వర్షిత తదితరులకు కలెక్టర్ చేత ప్రశంసా పత్రం అందజేయడంతో పాటు మెమొంటోళ్లను కూడా అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు,స్థానిక నాయకకులు తదితరులు పాల్గొన్నారు.

