ఏడుకొండల వద్ద ముంతాజ్ హోటల్ కు అనుమతులు రద్దు చేశాం-చంద్రబాబు
ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదు.
తిరుపతి: ఏడు కొండలు,, వేంకటేశ్వర స్వామి సొంతం…ఈ ఏడు కొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదు…తిరుమలలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం..గత ప్రభుత్వంలో తిరుమలలో ఎన్నో అపవిత్ర కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి,, ఆ రోజే చెప్పాను, ఇక్కడ నుంచే రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభించాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు..తన మనుమడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఉదయం ఆయన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రసాదాలు పంపిణీ చేశారు..అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు..తిరుమలలో ఎవరూ అపచారం చేయవద్దని,, ఏడుకొండల్లో అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు..ఏడు కొండలను కమర్షియల్ చేయొద్దు.. గతంలో అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ ఇతర ప్రైవేటు కార్యకలాపాలకు కేటాయించిన 35.32 ఎకరాలు క్యాన్సిల్ చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.. ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి వీలులేదని అన్నారు.. దేశంలో స్వామివారి ఆస్తులు కాపడటంకోసం కంకణం కట్టుకొని ఉన్నామని,, దేశంలో అన్ని రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని నిర్ణయించామన్నారు.. ఆలయాల నిర్మాణంకోసం కొత్తగా నిధి ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.