NATIONAL

శనివారం రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

131వ రాజ్యాంగ సవరణ బిల్లు..

అమరావతి: కేంద్ర కేబినెట్ సమావేశంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు విపక్షాల తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు దీనికి విపక్షాలు తప్పకుండా ఫలితం అనుభవిస్తాయని అన్నారు. మహిళలకు విపక్షాలు జవాబు చెప్పాలన్నారు. నారీశక్తి వందన్‌ బిల్లుకు ఆమోదం లభించకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ విషయాలపై శనివారం రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించ నున్నారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తరువాత,, రాత్రి సమయంలో ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అంటేనే అది ఎదో కీలకమైన విషయం అయ్యి వుంటుందని రాజకీయ పరిశీలకు భావిస్తున్నారు. ఇప్పటికే విపక్షాల తీరును కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ తప్పు పట్టారు. పార్లమెంట్ సమావేశాల్లో జరిగిన పరిణామాలుచ అదేవిధంగా బిల్లులకు మద్దతు ఇవ్వకపోవడంతో సహా, పలు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుధీర్ఘంగా ప్రసంగించనున్నారు.

మంత్రి కిరణ్ రిజిజు:- పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కేబినెట్ సమావేశం అనంతరం మాట్లాడుతూ, మహిళల హక్కులకు కాంగ్రెస్‌ వ్యతిరేకమన్నారు. రాజకీయ దురుద్దేశంలో ఈ బిల్లును విపక్షాలు అడ్డుకున్నాయని విమర్శించారు. లోక్‌సభలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదం పొందడంలో విఫలమవడంపై ఇతర కాంగ్రెస్ ఎంపీలు కూడా తనను కలిశారని.. ప్రభుత్వ ఉద్దేశాలు చాలా మంచివేనని, కానీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అంగీకరించడం లేదని, అందుకే ఎవరూ ఆయనను ఒప్పించలేమని వారు చెప్పారు. మనం ఏం చేయగలం? అంటూ రిజిజు వెల్లడించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *