NATIONAL

మ‌హిళ భాగ‌స్వామ్యం పెరిగితే, వ్య‌వ‌స్థ‌లో మార్పు వేగంగా ఉంటుంద‌-ప్రధాని మోదీ

మ‌హిళా సాధికార బిల్లు..

అమరావతి: దేశ రాజకీయాల్లో నూతన శకం ఆరంభం కాబోతోంది. దశాబ్దాల కాలంగా మూల పడివున్న మహిళా రిజర్వేషన్ల కల సాకారం అయ్యే సమయం ఆసన్నమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.సోమవారం  ఢిల్లీలో జరిగిన నారీ శక్తి వందన సమ్మేళనంలో పాల్గొన్న ప్రధాని, మహిళా సాధికారతపై కీలక వ్యాఖ్యలు చేశారు.

మ‌హిళా సాధికార బిల్లుకు ఆమోదం జ‌రిగేలా:- ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మ‌హిళా సాధికార‌త చ‌ట్టాన్ని 2029 నాటి వ‌ర‌కు అమ‌లు చేయాల‌ని డిమాండ్లు వ‌స్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. 2029 డెడ్‌లైన్‌ను దృష్టిలో పెట్టుకున్నామ‌ని, దీనిలో భాగంగానే ఏప్రిల్ 16వ తేదీ నుంచి మ‌హిళా సాధికార‌త చ‌ట్టం గురించి పార్ల‌మెంట్‌లో చ‌ర్చించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రి కృషిని దృష్టిలో పెట్టుకుని మ‌హిళా సాధికార బిల్లుకు ఆమోదం జ‌రిగేలా చూడాల‌న్నారు. దేశంలోని ప్ర‌తి మ‌హిళ సంతోష‌ప‌డుతుంద‌ని, ప్ర‌తి మ‌హిళ‌కు ల‌బ్ధి చేకూరుతుంద‌న్నారు.

కొత్త చ‌రిత్రకి పార్ల‌మెంట్ వేదిక:- నారీ శ‌క్తి వంద‌న్ అభినియం యాక్ట్ రూప‌క‌ల్ప‌న 21వ శ‌తాబ్ధంలోనే అత్యంత కీల‌క‌మైన అంశ‌మ‌న్నారు. కొత్త చ‌రిత్ర సృష్టించేందుకు పార్ల‌మెంట్ వేదిక కానున్న‌ద‌ని, గ‌త అనుభవలను దృష్టిలో పెట్టుకుని, భ‌విష్య‌త్తు ఆశ‌యాల‌కు అనుగుణంగా బిల్లు వస్తుందన్నారు.మ‌న దేశంలో పంచాయ‌తీ రాజ్ వ్య‌వ‌స్థ‌ల‌న్నీ మ‌హిళ‌ల నాయ‌క‌త్వానికి అసాధార‌ణ వేదిక‌ల‌య్యాయ‌న్నారు. ప్ర‌సంగాల‌తో చైత‌న్య‌ప‌ర‌చ‌డానికి ఇక్క‌డ‌కు రాలేద‌ని, ఈ దేశ మ‌హిళ‌ల ఆశీర్వాదం తీసుకునేందుకు ఇక్క‌డ‌కు వ‌చ్చిన‌ట్లు ప్ర‌ధాని చెప్పారు.

మ‌హిళ భాగ‌స్వామ్యం పెరిగితే:- భార‌తీయ మ‌హిళ‌లు ఈ దేశానికి ఎంతో మేలు చేశార‌న్నారు. ప్ర‌జాస్వామ్య విధానంలో మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని కొన్ని ద‌శాబ్ధాలుగా అంద‌రూ అనుకున్నార‌ని, 2023లో నారీశ‌క్తి వంద‌న్ అభినియం బిల్లును అన్ని పార్టీలు ఏక‌ప‌క్షంగా ఆమోదించాయ‌న్నారు. నిర్ణ‌యాత్మ‌క అంశాల్లో మ‌హిళ భాగ‌స్వామ్యం పెరిగితే, వ్య‌వ‌స్థ‌లో మార్పు వేగంగా ఉంటుంద‌ని అధ్య‌య‌నాలు వెల్ల‌డించిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. జ‌ల జీవ‌న్ మిష‌న్‌లో మ‌హిళ‌ల పాత్ర ప్ర‌శంస‌నీయ‌మ‌న్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *