ప్రవాసీ భారతీయ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
అమరావతి: విదేశాల్లో నివాసిస్తున్న భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించింది..ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో జరుగుతున్న 18వ ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా ఈ రైలును వర్చువల్‌గా ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు.. NRI టూరిస్టుల కోసం ఈ రైలు,,ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలు బయలుదేరుతుంది..3 వారాల ప్రయాణంలో దేశంలోని పలు సంప్రదాయ,, మతపరమైన ప్రదేశాలను ప్రవాసీ భారతీయ ఎక్స్ ప్రెస్ రైలు చుట్టివస్తుంది..
విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం ఈ టూరిస్టు రైలు కాన్సెప్ట్‌ను రూపొందించారు.. 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఈ రైలులో ప్రయాణం చేయవచ్చు..ప్రవాసీయులు వారి చారిత్రాత్మక మూలాలను సృశించే విధంగా ఈ రైలు రూట్‌ను తయారు చేశారు..ఢిల్లీ నుంచి బయలుదేరే రైలు,,అక్కడి నుంచి అయోధ్య,, పాట్నా, గయా, వారణాసి, మహాబలిపురం, రామేశ్వరం, మధురై, కొచ్చి, గోవా, ఎక్తా నగర్(కేవడియా), అజ్మీర్, పుష్కర్, ఆగ్రా పట్టణాలను ఆ రైలు చుట్టువస్తుంది..ఈ రైలులో 156 మంది ప్రయాణికుల ప్రయాణించే అవకాశం ఉంటుంది..విదేశాంగ శాఖ,,భారతీయ రైల్వే,,IRTC సంయుక్తంగా ప్రవాసీ రైలును ప్రారంభిస్తున్నారు..వివిధ దేశాల్లోని భారతీయ ఎంబసీల నుంచి ఈ రైలు ప్రయాణికుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు..విదేశాంగశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం,, రైలు టూరుకు చెందిన అన్ని ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.. ఆయా దేశాల నుంచి ఇండియాకు వచ్చే ప్రవాసీల తిరుగు ప్రయాణంకు సంబంధించిన విమాన టిక్కెట్ లో 90 శాతం కూడా ప్రభుత్వమే ఖర్చు పెట్టనున్నది..ప్రయాణికులు కేవలం 10 శాతం ఛార్జీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది..ఈ రైలులో టూర్ చేసే వారికి 4 స్టార్ హోటల్ అకామిడేషన్ ఇవ్వనున్నారు..ఈ రాయితీలు పొందాలంటే ఖచ్చితంగా ప్రవాసీయులు అయ్యి వుండాలి.