రాష్ట్రాంలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 3వ సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పర్యటించారు..విశాఖపట్నం విమానశ్రయంకు చేరుకున్న ప్రధాని మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనంగా స్వాగతం పలికారు..ఈ సందర్భంగా సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ వరకు రోడ్ షో నిర్వహించారు..అనంతరం ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు..వర్చువల్ గా విశాఖపట్నంలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు..ఈ సందర్బంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ తన అభిమానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించే అవకాశం ఇప్పుడు వచ్చిందన్నారు.. తెలుగులో ప్రసంగం మొదలు పెట్టిన ప్రధాని మోదీ, ఆంధ్ర ప్రజల ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేశారు..నేడు తలపెట్టిన ప్రాజెక్టులు రాష్ట్ర వికాసానికి తోడ్పడతాయని అలాగే ఐటీ, టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రం కానుందని అభిప్రాయం వ్యక్తం చేశారు..దేశంలో రెండు గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లు ప్రారంభం కానున్నయని,,అందులో ఒకటి విశాఖకు కేటాయించడం జరిగిందన్నారు.. గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా ఎంతోమందికి ఉపాధి లభిస్తుందన్నారు.. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కు శంకుస్థాపన చేశామన్నారు..దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు పునాదిరాయి వేశామని,, రాష్ట్ర అభివృద్ధిలో రైల్వే జోన్ కీలకం కానుందని తెలిపారు.. రైల్వే జోన్ ద్వారా రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుందన్నారు..రైల్వే జోన్ వల్ల వ్యవసాయ, పర్యాటక రంగాలు ఊపందుకుంటాయని ప్రధాని మోదీ అన్నారు.
సీ.ఎం చంద్రబాబు:- ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు,, ప్రారంభోత్సవాలు చేశారని,, ఏడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం జరిగిందన్నారు.. బల్క్ డ్రగ్ పార్క్ కోసం నక్కపల్లిలో రూ.1,877 కోట్ల పెట్టుబడులు,,క్రిస్ సిటీ ఇండ్రస్ట్రియల్ ఏరియా కృష్ణపట్నంలో రూ.2,300 కోట్ల పెట్టుబడులు,,ఏడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన,వీటికి రూ.6,177 కోట్ల పెట్టుబడులు,, రూ.5,718 కోట్లతో మూడు రైల్వే ప్రాజెక్టులు నేడు ప్రారంభించారన్నారు..ఇన్నాళ్లకు విశాఖ రైల్వేజోన్ కల సాకారమైందన్నారు.. విశాఖ రైల్వే జోన్‌కు గత ప్రభుత్వం భూమి ఇవ్వకపోతే 52 ఎకరాలు ఇచ్చి నగరవాసుల చిరకాల కలైన విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభించామన్నారు..రూ.4,593 కోట్లతో 321 కిలోమీటర్ల మేర 10 జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన,,రూ.3,044 కోట్లతో 234 కిలోమీటర్ల పొడవైన ఏడు జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం చేశారన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్:- ఏపీ ప్రజలు NDAను నమ్మారని అందుకే పట్టం కట్టారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు..రైల్వే జోన్‌తో పాటూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు విచ్చేశారన్నారు.. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒక వ్యక్తి, ధైర్య సాహసాలతో నింపితే అది పటిష్ట భారత్‌గా మారుతుందని,, సదాశయంతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిస్తే, అది స్వచ్ఛ భారత్ అవుతుందని,, సదుద్దేశం, సదాశయం ఉంటే ఏదైనా సాధ్యమేనని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేసి చూపిస్తున్నారని చెప్పారు.