దేశంలో పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదు-కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ
అమరావతి: దేశంలో పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదని,,కంగారు పడి కొనుగోళ్లు చేయవద్దని ప్రజలను కోరుతూ ప్రకటన విడుదల చేసింది. సాధారణ కంటెయినర్‌ల్లో పెట్రోల్, డీజిల్ నిల్వ చేయడం ప్రమాదకరమని హెచ్చరిస్తూ తమిళనాడులో ఒక పెట్రోల్ బంక్ నుంచి సాధారణ కంటెయినర్లో పెట్రోల్ తీసుకుని వెళ్లుతున్న విషయం తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ సూచన చేస్తున్నట్టు తెలిపింది. ఇలాంటి చర్యలతో భద్రతాపరమైన ముప్పు పెరుగుతుందని హెచ్చరించింది. కంటెయినర్‌ల్లో పెట్రోల్‌ను పట్టి ఇస్తూన్న రిటైల్ ఔట్‌లెట్‌పై కఠిన చర్యలు తీసుకున్నామని పెట్రోలియం శాఖ వెల్లడించింది. పెట్రోల్, డీజిల్ విక్రయాలకు సంబంధించి పెట్రోల్ పంప్‌లు, డీలర్లకు భద్రతాపరమైన మార్గదర్శకాలు జారీ చేశామని కూడా కేంద్రం పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కంటెయినర్‌ల్లో పెట్రోల్, డీజిల్ ఎట్టి పరిస్థితిలోను నింప వద్దని రిటైల్ ఔట్‌లెట్‌కు సూచించింది.

LPG డెలివరీల్లో ఎలాంటి ఆటంకాలు లేవు:- గృహవినియోగ LPG సిలిండర్ల విషయంలో నెలకొన్న భయాందోళనలపై ఇటీవల మార్కెటింగ్ ఆయిల్ రిఫైనరీ విభాగం జాయింట్ సెక్రెటరీ స్పందిస్తూ LPG డెలివరీల్లో ఎలాంటి ఆటంకాలు లేవన్నారు. గ్యాస్ ఉత్పత్తిని భారతీయ రిఫైనరీలు 30 శాతం మేర పెంచాయని తెలిపారు. గృహ వినియోగదారులు, ఆసుపత్రులు, విద్యాసంస్థలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ జాగ్రత్త తీసుకున్నట్టు తెలిపారు.

