ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయిన నటుడు రాజేంద్రప్రసాద్
శ్రీకాళహస్తీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు పవన్ కళ్యాణ్ ఆహ్వానం…
అమరావతి: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ప్రముఖ నటులు రాజేంద్రప్రసాద్ బుధవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. రాజేంద్ర ప్రసాద్ కి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించిన నేపథ్యంలో మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రివర్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ కి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.
బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం:-

ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తిలో శివరాత్రి సందర్భంగా ఈ నెల 10వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ని ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కొట్టే సాయిప్రసాద్ ఆహ్వానించారు. బుధవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వాన పత్రికతో పాటు స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్ కి వేదాశీర్వచనాలు అందించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు పగడాల మురళీ, ఆలయ అధికారులు ఆహ్వానం పలికిన వారిలో ఉన్నారు.

